తృప్తి క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్ రాజకుమారి

664చూసినవారు
తృప్తి క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని తృప్తి క్యాంటీన్‌ను సందర్శించి, పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాలు నాణ్యతతో పాటు రుచికరంగా ఉండేలా చూడాలని, క్యాంటీన్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.