శక్తి యాప్ మీ చేతిలో ఉంటే ఆయుధం మీ వెంట ఉన్నటే

0చూసినవారు
శక్తి యాప్ మీ చేతిలో ఉంటే ఆయుధం మీ వెంట ఉన్నటే
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీమ్ హెడ్ కానిస్టేబుల్ డీ యన్. ప్రసాద్, మహిళా పోలీస్ లక్ష్మి దేవి ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మల సత్రం వద్ద గల స్పై రెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో మహిళా కళాశాలలో అమ్మాయిలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ యాప్ ప్రతి అమ్మాయి సెల్‌ఫోన్‌లో ఉంటే, అది ఒక ఆయుధంలా పనిచేస్తుందని, అల్లరి మూకల నుండి రక్షణ కల్పిస్తుందని, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు సేఫ్ మోడ్‌లో సురక్షితంగా ఉండవచ్చని, సెల్‌ఫోన్ నుండే ఫిర్యాదులు చేసుకోవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లకు కాల్ చేయాలని, సైబర్ నేరాలకు పాల్పడితే 1930కు కాల్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్