కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నమ్మ (56) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె, నొప్పి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రెవెన్యూ ఎస్ఐ ధనుంజయ్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.