నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ చెంద్రప్ప తన నిజాయితీని చాటుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన చెంద్రప్ప కుటుంబంతో కలిసి ఆలయానికి దర్శనానికి వచ్చి, పుష్కరిణి కోనేరు వద్ద స్నానం చేసిన అనంతరం తన మొబైల్ ఫోన్‌ను అక్కడే మర్చిపోయారు. విధుల్లో ఉన్న హోమ్ గార్డ్ దీన్ని గమనించి, మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా యజమానిని గుర్తించి, చెంద్రప్పకు ఫోన్‌ను అప్పగించారు. హోమ్ గార్డ్ నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవను భక్తులు, ఆలయ అధికారులు అభినందించారు.