అన్నమయ్య జిల్లా లో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి

0చూసినవారు
అన్నమయ్య జిల్లా లో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి గురువారం సహచర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఈ పింఛన్లు అందుతున్నాయి. అక్టోబర్ నెల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 2,692.34 కోట్లను విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పనిచేస్తోంది. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్