ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి ఫరూక్

198చూసినవారు
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి ఫరూక్
నంద్యాల టౌన్ 21వ వార్డు ఇందిరానగర్‌లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇంటి వద్దకే చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రైల్వే లైన్ విస్తరణతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల సమస్యలను కూడా ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్