నంద్యాల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘావృతమై, సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల రహదారులు జారుబారుగా మారడంతో వాహనదారులు, విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. మొంథా తుఫాన్ ప్రభావం నుంచి కోలుకుంటున్న రైతులు మళ్లీ వర్షం పడటంతో ఆందోళన చెందుతున్నారు.