కష్టపడి పండించిన పంట వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే ఆ అన్నదాతల కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పులు చేసి వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట దిగుబడి రోడ్డుపై తడిసిపోతుంటే, నీటిని తోడుతూ, ధాన్యం తట్టల్లో నింపుతూ కాపాడుకునే ప్రయత్నం చేసిన తీరు కంటతడి పెట్టిస్తోంది. 'ఏటా నష్టం ఎన్నాళ్లో కష్టం మాకు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృశ్యం ఆళ్లగడ్డ సమీపంలోని నర్సాపురం-అహోబిలం మార్గంలో కనిపించింది.