నంద్యాల బుడగజంగం హాస్టల్‌ను సందర్శించిన ఎంపీ బైరెడ్డి శబరి, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. మంచి మార్కులు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలియజేసి, మిగిలిన విద్యార్థులను కూడా పట్టుదలతో చదవాలని ప్రోత్సహించారు. విద్యే భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.