నంద్యాల సమీపంలోని నందమూరి నగర్ వంతెనను సోమవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మరమ్మతుల కోసం మూసివేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాణీ మహరాణి ప్రాంత బ్రిడ్జి మూసివేతతో నందమూరి నగర్, వైయస్ నగర్ వాహనదారులు కూడా సతమతమయ్యారు.