నంద్యాల: NTR అక్షరాలలో 20 చిత్రాలు

3చూసినవారు
నంద్యాల: NTR అక్షరాలలో 20 చిత్రాలు
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఒక వినూత్న ప్రయత్నం చేశారు. కేవలం 8 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద 'NTR' అనే అక్షరాలను రాసి, ఆ మూడు అక్షరాలలో ఎన్టీఆర్ వివిధ పాత్రల రూపాలతో కూడిన 20 చిత్రాలను అద్భుతంగా వేశారు. ఈ చిత్రాలను మైక్రో పెన్ను, మైక్రో బ్రష్‌లు, వాటర్ కలర్ పెయింటింగ్స్ ఉపయోగించి సృష్టించారు. ఇది కళాకారుడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్