నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో రాజశ్రీ ఏఎస్పీ మేడంగారు ఫోక్సో చట్టంపై శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర నంబర్లు 100, 112, సైబర్ నేరాలకు 1930, బాలికల రక్షణకు 1098కు కాల్ చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలని, వారి చదువుపై శ్రద్ధ వహించాలని, బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు. పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలని నంద్యాల ఏఎస్పీ సూచించారు.