నంద్యాల: ఈవీఎం గోదాముల పర్యవేక్షణలో కలెక్టర్ రాజకుమారి

1096చూసినవారు
నంద్యాల: ఈవీఎం గోదాముల పర్యవేక్షణలో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల కలెక్టర్ జి. రాజకుమారి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు టేక్కే మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎం గోదాములను శనివారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీళ్లను పరిశీలించి, భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూశారు. పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేసి అధికారికంగా నమోదు చేశారు. పోలీస్ గార్డులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :