భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం టేక్కే మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద వేసిన సీళ్లను పరిశీలించి, ఈవీఎంల భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలను సమీక్షించారు.