జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల అనుమతులను వేగంగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. DIEPC సమావేశంలో ఉత్పాదన, సేవా రంగాలకు చెందిన 7 యూనిట్లకు రూ. 34. 30 లక్షల రాయితీలకు ఆమోదం తెలిపారు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జిల్లా జీడీపీ పెంపుపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.