నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా సమీపంలోని నేషనల్ హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైకు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రుద్రవరం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.