తంబళ్లపల్లె కోర్టు దొంగతనం కేసులో నలుగురికి ఏడాది జైలు శిక్ష విధించింది. నంద్యాల జిల్లాకు చెందిన అంకన్న, సత్య హరిశ్చంద్రుడు, చిన్నహుస్సేని, జంబులు 2025 అక్టోబరులో పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ హరిహర ప్రసాద్ నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి ఒక్కో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 1, 000 జరిమానా విధించారు.