నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన MPTC చంటిగారి కృపాకర్ మంగళవారం రాత్రి నరసరావుపేటలో కిడ్నాప్‌కు గురయ్యారు. జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎంపీటీసీలు ఒక అతిథి గృహంలో బస చేశారు. ఈ క్రమంలో నందికొట్కూరుకు చెందిన సురేశ్ యాదవ్ తన అనుచరులతో వచ్చి కృపాకర్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నరపరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.