ఏషియన్ గేమ్స్‌లో నంద్యాల చిన్నారి చిన్మయి శ్రేయ సత్తా

739చూసినవారు
ఏషియన్ గేమ్స్‌లో నంద్యాల చిన్నారి చిన్మయి శ్రేయ సత్తా
నంద్యాల ముద్దుబిడ్డ, ఫెన్సింగ్ క్రీడాకారిణి పబ్బతి చిన్మయి శ్రేయ, ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి రాయలసీమకే తొలిసారిగా గుర్తింపు తెచ్చింది. 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్ 17 బాలికల విభాగంలో మూడవ స్థానం సాధించి, ఆంధ్రప్రదేశ్ తరపున తొలి పతకాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీలలో పశ్చిమబెంగాల్, గోవా, ఐ బి ఎస్ ఎస్ ఓ, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులను ఓడించి, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్