నంద్యాల: అపార్ ఐడి ప్రక్రియను వేగవంతం చేయండి

నంద్యాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల అపార్ ఐడి ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత విద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అపార్ ఐడి పురోగతిపై నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల విద్యా పురోగతిని ట్రాక్ చేయడానికి అపార్ ఐడి కీలక సాధనమని, దీనివల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు.
