నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీసేవ కార్యక్రమం ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. కల్యాణ మంటపంలో మహానందీశ్వరుడు, కామేశ్వరీ దేవి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల శివనామస్మరణ మధ్య పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహానంది ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.