నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నంద్యాల జిల్లా
టీడీపీ,
జనసేన,
బీజేపీ ఉమ్మడి కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా
టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా
టీడీపీ పరిశీలకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయత, సమన్వయాన్ని బలోపేతం చేసి, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎమ్మెల్యే,
బీజేపీ మరియు
జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.