నంద్యాల: వాకింగ్‌కు వెళ్లిన మహిళ గొలుసు లాక్కెళ్లిన దొంగ

1695చూసినవారు
నంద్యాల: వాకింగ్‌కు వెళ్లిన మహిళ గొలుసు లాక్కెళ్లిన దొంగ
నంద్యాల పద్మావతి నగర్‌లో రాత్రి వాకింగ్ చేస్తున్న మహిళ భావమ్మ మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్