నంద్యాల, నందికొట్కూరులో
టీడీపీ నాయకుల విమర్శలు, ఆరోపణలపై
వైసీపీ ఇన్‌ఛార్జ్ డా. ధారా సుధీర్ స్పందించారు. బుధవారం నందికొట్కూరులోని
వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ
టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే స్పందిస్తున్నానని తెలిపారు.