డిజిటల్ అరెస్టు ఏ పోలీసు వారు చేయరు.. శక్తి టీం

1842చూసినవారు
డిజిటల్ అరెస్టు ఏ పోలీసు వారు చేయరు.. శక్తి టీం
నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై శనివారం అవగాహన కల్పించారు. నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి మాట్లాడుతూ డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బులు కొట్టేస్తున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ కాల్స్ వస్తే భయపడకుండా 1930కి కాల్ చేస్తే సైబర్ నేరాలను అరికట్టవచ్చని సూచించారు. విద్యార్థినులకు సెల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు.

సంబంధిత పోస్ట్