రబీ సీజన్లో ఓర్వకల్లు మండలంలో 7వేల ఎకరాల్లో పప్పు, శనగ సాగు చేసిన రైతులు దిగుబడి బాగానే ఉన్నా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఎకరాకు 8-10 క్వింటళ్ల దిగుబడి వస్తున్నా, మార్కెట్లో రూ.5500 మాత్రమే ధర పలుకుతోంది. రూ.7వేలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.