వజ్రాల వేటలో జనం: కోటి ఆశలతో అన్వేషణ

721చూసినవారు
వజ్రాల వేటలో జనం: కోటి ఆశలతో అన్వేషణ
నల్లమల అడవిలో వజ్రాల వేట కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద వజ్రాల వంకలో ఆదివారం వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఒక వజ్రం దొరికితే అప్పులు తీరుతాయనే కోటి ఆశలతో ఈ అన్వేషణ సాగుతోంది.

సంబంధిత పోస్ట్