మహానంది దేవస్థానం ప్రాంగణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు. నిత్యం 30-45 నిమిషాల పాటు యోగాభ్యాసం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన వందితను ఆమె అభినందించారు.