నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన భారీ సిగరెట్ కార్టన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. అత్యాధునిక CCTV 360 టెక్నాలజీతో నిందితులను గుర్తించినట్లు ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. వారి నుంచి రూ.14 లక్షల నగదు, స్విఫ్ట్ కారు, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు రాష్ట్రాల్లో 10 నుంచి 15 దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు.