రుద్రవరం: 108 వాహనంలో మహిళ ప్రసవం

1చూసినవారు
రుద్రవరం: 108 వాహనంలో మహిళ ప్రసవం
108 వాహనంలో శనివారం ప్రసవం జరిగి తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ ఎల్.శ్రీనివాసులు, పైలట్ నాగరాజు తెలిపారు. రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జయలక్ష్మి ప్రసవ వేదనతో బాధ పడుతుండగా వారి బంధువులు 108 వాహనానికి సమాచారం అందించారన్నారు. అక్కడికి చేరుకొని వారిని వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలో మహిళ ప్రసవం అయిందన్నారు.

సంబంధిత పోస్ట్