కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త మంగళి ఈశ్వరయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పాణ్యం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గ్రామానికి వెళ్లి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, ఆయన ఈశ్వరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.