నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 140 మంది విద్యార్థులకు, హెడ్మాస్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శక్తి యాప్ గురించి గురువారం అవగాహన కల్పించారు. శక్తి యాప్ నంబర్ 7993485111 ను తెలిపి, సైబర్ నేరాలైన ఫేక్ మెసేజ్ లు, యాప్స్, ఓటీపీ నంబర్ అడిగితే చెప్పరాదని, ప్రస్తుతం పెళ్లి పత్రిక పేరుతో వస్తున్న యాప్ లను ఓపెన్ చేయరాదని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు సంప్రదించాలని తెలిపారు.