బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన

0చూసినవారు
బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి బొమ్మల సత్రం మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థినిలకు మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణ, వ్యక్తిగత భద్రత, అపరిచితులతో వ్యవహరించే జాగ్రత్తలు, అత్యవసర సమయంలో 100, 112 కాల్స్ ఉపయోగించడం గురించి అవగాహన కల్పించారు. లైంగిక దాడికి గురైతే వెంటనే తల్లిదండ్రులకు, టీచర్లకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్కడి టీచర్లకు శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు.

సంబంధిత పోస్ట్