ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు అర్జీలు స్వీకరించి, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని, జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఆమె సూచించారు.