నంద్యాల జిల్లాలో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

553చూసినవారు
నంద్యాల జిల్లాలో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
నంద్యాల జిల్లాలో పలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. గోస్పాడులో అత్యధికంగా 41.6 డిగ్రీలు, పాణ్యంలో 41.5, శిరివెళ్ల, దొర్నిపాడు, చాగలమర్రిలో 41.4, ఆళ్లగడ్డలో 41.3, అవుకులో 41.2, గడివేములలో 41.1, కొత్తపల్లిలో 41, ఓర్వకల్లులో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్