నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నంద్యాల శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను, యువత దేశానికి వెన్నెముక అని, వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈగల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోలను లైక్, షేర్ చేయాలని కోరారు. గంజాయి నిర్మూలన జిల్లా ఈగల్ టీం ముఖ్య ధ్యేయమని తెలిపారు.