పగిడ్యాలలోని జగనన్న కాలనీలో రాత్రి పిడుగుపాటుకు విద్యుత్ స్తంభం విరిగిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారులు వెంటనే స్పందించి కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం నందికొట్కూరులో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.