నల్లమల అడవిలో విషాదం: రైలు ఢీకొని పెద్దపులి మృతి

548చూసినవారు
నల్లమల అడవిలో విషాదం: రైలు ఢీకొని పెద్దపులి మృతి
నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక ఆడ పెద్దపులి గూడ్స్ రైలు ఢీకొని మరణించింది. గాజులపల్లి-చలమ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు ఐదేళ్ల వయసున్న ఆరోగ్యవంతమైన పులి మృతితో అటవీ శాఖ అధికారులు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్