విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ క్రీడా కోటలో ఎంపికైన ఉపాధ్యాయులపై జరిగిన దాడి సరికాదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోర్ల సుధాకర్ నంద్యాలలో ఓ ప్రకటనలో తెలిపారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులపై రాజకీయాల ముసుగులో కొందరు దాడి చేయడం హేయమైన చర్య అని వెంటనే వారని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులపై దాడులను అరికట్టే విధంగా భద్రతా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.