నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: వైసీపీ నాయకుడిపై అనుమానం

110చూసినవారు
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బైటిపేటకు చెందిన చాకలి జంబులయ్య (47) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిగా నంద్యాల 41వ వార్డుకు చెందిన వైసీపీ పార్టీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్