
కల్లూరు: రిచ్మండ్ కాలనీ రోడ్డును తక్షణం అభివృద్ధి చేయాలి
కర్నూలు కార్పొరేషన్ 36వ వార్డులోని రిచ్మండ్ కాలనీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు దయనీయస్థితిపై సీపీఎం నగర కార్యదర్శి టి. రాముడు నేతృత్వంలోని బృందం గురువారం పర్యటించి ఆందోళన వ్యక్తం చేసింది. పలుమార్లు వినతులు ఇచ్చినా రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు పరిష్కారం కానందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రిచ్మండ్ కాలనీ రోడ్డును తక్షణం సిసిరోడ్డుగా అభివృద్ధి చేయాలని, లేదంటే కార్పొరేషన్ కార్యాలయంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.







































