నడిరోడ్డుపై కాలిపోయిన బొలెరో

298చూసినవారు
నడిరోడ్డుపై కాలిపోయిన బొలెరో
నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు తన బొలెరో వాహనంలో వరిగడ్డి చుట్టల లోడును తరలిస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డికి మంటలు అంటుకుని వాహనం దగ్ధమైంది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్