గడివేముల మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలగనూరు-రేగడి గూడూరు మార్గంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో చోదకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అలగనూరుకు చెందిన భాషగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.