పాణ్యంలో మూడు ఇళ్లలో చోరీలు

858చూసినవారు
పాణ్యంలో మూడు ఇళ్లలో చోరీలు
మంగళవారం పాణ్యం మండల కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. గోడల్చేలు కాలనీలో షఫీమూన్ ఇంట్లో రూ. 30 వేల నగదు, రూ. 30 వేల విలువైన బంగారం, లక్ష్మిదేవి ఇంట్లో రూ. 20 వేల నగదు, 12 తులాల వెండి అపహరణకు గురయ్యాయి. శాలీషా పేటకు చెందిన మునాఫ్ ఇంట్లో కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిన సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు తిరిగి వచ్చిన తర్వాత చోరీ సొత్తు పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్