హుసేనాపురం: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

476చూసినవారు
హుసేనాపురం: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన 60 ఏళ్ల ఉపాధి కూలి అమీనాబి వడదెబ్బతో మృతి చెందారు. గురువారం ఉపాధి హామీ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె అస్వస్థతకు గురై, పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్