కర్నూలులో రేపు నిరుద్యోగులకు ఉద్యోగ మేళా

1758చూసినవారు
కర్నూలులో రేపు నిరుద్యోగులకు ఉద్యోగ మేళా
కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా జరగనుంది. జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. దీప్తి బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ముథూట్, అపోలో ఫార్మసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. పదో తరగతి నుండి డిగ్రీ, ఫామ్ (బీడీఎం) వరకు చదివినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలు, ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్