సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభ ఈనెల 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో, 17వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ కర్నూలు నగర నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం కల్లూరు సూర్యనారాయణ భవనంలో జరిగిన మట్టి పని కార్మికుల సమావేశంలో, సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కన్నసుధాకరప్ప, భవన నిర్మాణ సంఘం నాయకులు జి. ఏసు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అన్యాయ పరిస్థితులను వివరించారు.