పాణ్యం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. మహిళలను కించపరిచే కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నేతలు, మహిళా కార్యకర్తలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతులను మంటల్లో వేసి, రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులను తగలబెట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం, కల్లూరు మండల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నేతలు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.