పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, భక్తుల మనోభావాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బతీశారని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. శనివారం కల్లూరు అర్బన్ పరిధిలోని క్రిష్ణానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు, భక్తులతో కలిసి పసుపునీళ్లతో ఆలయ శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువనేతలు పాల్గొన్నారు.