కల్లూరు: సహకార వారోత్సవాల్లో రచ్చబండ, మొక్కల నాటకం

1540చూసినవారు
కల్లూరు: సహకార వారోత్సవాల్లో రచ్చబండ, మొక్కల నాటకం
సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం కర్నూలు జిల్లాలోని పసుపల, కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో సహకార రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సహకార అధికారిణి ఐ. డి. శిరీష, డివిజినల్ సహకార అధికారిణి బి. చెన్నమ్మ పాల్గొని రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం దేవనకొండ, ఆలూరు, పత్తికొండ, గోనెగండ్ల, ఆస్పరి, సి. బెళగల్ తదితర ప్రాంతాల్లో సహకార సంఘాల జెండా ఆవిష్కరణ, మొక్కల నాటకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్